దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సేవలు

by S Gopi |
దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సేవలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటివరకు దేశంలోని చాలా నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ, సౌకర్యాలతో ట్రాఫిక్ కష్టాలను ఈ మెట్రో రైళ్లు తీరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. నీటి అడుగున మెట్రో రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో దేశంలోని తొలి అండర్ వాటర్ మెట్రోను ఆవిష్కరించిన తర్వత ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.

గతంలో దేశీయంగా తొలి మెట్రో సేవలు కోల్‌కతాలోనే మొదలయ్యాయి. ఇది 1984లో ప్రారంభమైంది. తాజాగా అండర్ వాటర్ మెట్రో రైలు కూడా అందుబాటులోకి రానుండటంతో సరికొత్త రికార్డు బెంగాల్ ఖాతాలో చేరింది. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్‌లను మెట్రో స్టేషన్‌లను కలుపుతూ 4.8 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ గ్రీన్‌లైన్ మార్గంలో మూడు స్టేషన్లు ఉన్నాయి. నీటి ఉపరితలానికి 16 మీటర్ల లోతులో రైళ్లు నడుస్తాయి. ఇదో అద్భుతమని, ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 7 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్లు కోల్‌కతా మెట్రో రైలు జీఎం చెప్పారు. ప్రధాని మోడీ మెట్రో సర్వీసులను ప్రారంభించిన మరుసటి రోజు నుంచి ప్రయాణికులను అనుమతి ఉంటుందని అధికారులు వెల్లడించారు. నది కింద నిర్మించిన ఈ టన్నెల్‌ మార్గం ద్వారా మెట్రో రైలు జంట నగరాలు హౌరా, కోల్‌కతాలను కలుపుతుంది. మొత్తం ఆరు స్టేషన్ల మధ్య సేవలందించనుండగా, వీటిలో మూడు స్టేషన్లు నదీ కింది భాగంలో ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed