- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందూ రాజులను అవమానించారని రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ ఆరోపణలు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ఈసారి భారత్‌లోని రాజులు, మహారాజులను అవమానించారని విమర్శించారు. అయితే, బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్షాలు చేసిన దురాగతాలపై మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం కర్ణాటకలోని బెళగావిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన మోడీ, ఓటు బ్యాంకు కోసమే దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్ రాయించింది. ఇప్పటికీ కాంగ్రెస్ యువరాజు ఆ పాపాలను కొనసాగిస్తున్నారు. రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించినట్టు రాహుల్ చెబుతున్నారు. తద్వారా ఛత్రపతి శివాజీ, కిత్తూరు రాణి చన్నమ్మా లాంటి మహానుభావులను అవమానించారు. ఓటు బ్యాంకు, రాజకీయల కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. కానీ, దేశ చరిత్రలో నిజాంలు, నవాబులు, సుల్తాన్‌లు చేసిన దౌర్జన్యాలపై ఆయన ఒక్క మాటా మాట్లాడరని మోడీ ఆరోపణల స్థాయిని పెంచారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దాష్టికాన్ని రాహుల్ గాంధీ మరిచిపోయారు. అనేక దేవాలయాలను ద్వంసం చేశారని, అలాంటి వారిని ప్రశంసించే వారితో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోసం బాధిస్తోంది. ఇదే సమయంలో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని, పరిస్థితులు అధ్వాన్నంగా మారిపోయాయని అన్నారు. బెలగావిలో ఆదివాసీ మహిళపై జరిగిన అఘాయిత్యం, చిక్కోడిలో జైన సన్యాసిని చంపిన సంఘటనలను గుర్తు చేసిన మోడీ, ఇలాని దాడుల కారణంగా కర్ణాటక రాష్ట్రం కీర్తిని దిగజారుతున్నాయని మోడీ పేర్కొన్నారు.