- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pm modi: స్వార్థపూరిత రాజకీయాలు సరికాదు.. బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలపై మోడీ ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్(West Bengal), ఢిల్లీ(delhi)ల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని (Aayushman barath scheme) అమలు చేయకపోవడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ స్కీమ్‌ను ఇంప్లిమెంట్ చేయడం లేదని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్(Tmc), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాలకు మానవత్వం లేదని మండిపడ్డారు. వృద్ధుల కోసం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (Pm-Jay) బీమా పథకాన్ని మోడీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ వయ వందన్ కార్డును అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ఢిల్లీ, బెంగాల్‌లు ఈ పథకంలో చేరలేనందుకు అక్కడి వృద్ధులకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. స్వార్థం కారణంగా ప్రభుత్వాలు ప్రజల అనారోగ్యాన్ని పట్టించుకోవడం సరికాదన్నారు.
వృద్ధులు ఆరోగ్యంగా ఆత్మగౌరవంతో జీవించాలని ఇందుకు Pm-jay పథకం ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. దీని ద్వారా కుటుంబ ఖర్చులు, ఆందోళనలు తగ్గుతాయన్నారు. ఆయుష్మాన్ పథకం ద్వారా 4 కోట్ల మంది పేదలు లబ్ధి పొందారని గుర్తు చేశారు. గర్భిణీ స్త్రీల టీకా కోసం ఉద్దేశించిన U-WIN పోర్టల్‌ను సైతం మోడీ ఈ సందర్భంగా ప్రారంభించారు. కాగా, దేశ వ్యాప్తంగా 6 కోట్ల మంది వృద్ధులు Pm-jay పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఈ పథకంతో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వైద్య సాయం అందుతుంది.