- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం.. ఈ అవార్డు అందుకోనున్న రెండో విదేశీ నేతగా రికార్డు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. నైజీరియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజర్’ తో మోడీని సత్కరించనున్నట్టు నైజీరియా ప్రకటించింది. మోడీ తన మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రస్తుతం నైజీరియాలోనే ఉన్నారు.17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే అవార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో విదేశీ నేతగా మోడీ రికార్డు సృష్టించనున్నారు. మోడీ కంటే ముందు బ్రిటన్ మాజీ క్వీన్ ఎలిజబెత్‌కు మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఆమెను 1969లో ఇదే అవార్డుతో సత్కరించారు.
అంతకుముందు నైజీరియా చేరుకున్న మోడీకి అక్కడి భారతీయులు, నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఘన స్వాగతం పలికారు. చైనా, నెదర్లాండ్స్ తర్వాత నైజీరియా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. నైజీరియా పర్యటన అనంతరం మోడీ బ్రెజిల్ వెళ్లనున్నారు. కాగా, ఇప్పటి వరకు 15 దేశాలు మోడీని తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. ఈ నెల14న డొమినికా దేశం మోడీకి అత్యున్నత పురస్కారమైన ‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ని అందజేయనున్నట్టు ప్రకటించింది.
Read More..
Hyper Sonic Missile ప్రయోగం సక్సెస్.. చరిత్ర సృష్టించిన భారత్