Pm modi: జేఎంఎం, కాంగ్రెస్‌లు ఓబీసీలకు వ్యతిరేకం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Pm modi: జేఎంఎం, కాంగ్రెస్‌లు ఓబీసీలకు వ్యతిరేకం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM), కాంగ్రెస్ పార్టీలు ఓబీసీలను విభజిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ (Pm Narendra modi) ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగించే అవకాశం ఉందని విమర్శించారు. జార్ఖండ్‌లోని బొకారో(Bokaro)లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని తెలిపారు. వీరందరూ ఐక్యంగా లేనంత వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని చోటా నాగ్ పూర్ ప్రాంతంలో 125 కంటే ఎక్కువ ఉప కులాలు ఓబీసీలుగా పరిగనించబడుతున్నాయని గుర్తు చేశారు. ఈ ఉపకులాలను ఒకదానితో ఒకటి ఇరకాటంలో పెట్టడం ద్వారా కాంగ్రెస్, జేఎంఎంలు లబ్ది పొందాలనుకుంటున్నట్టు తెలిపారు.

90వ దశకంలో ఓబీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 250 మార్కును దాటలేకపోయిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 మధ్య కాలంలో జార్ఖండ్‌కు రూ. 80,000 కోట్ల ఆర్థిక సాయం అందిందని తెలిపారు. ఆ టైంలో పీఎం మన్మోహన్ సింగ్ బదులుగా సోనియా గాంధీ ప్రభుత్వాన్ని నడిపారన్నారు. 2014 తరువాత ఢిల్లీలో ప్రభుత్వం మారిందని, ఫలితంగా గత పదేళ్లలోనే జార్ఖండ్‌కు రూ.3లక్షల కోట్ల రూపాయలకు పైగా అందజేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed