PM Modi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ రూ.11 వేల కోట్ల పనులకు శంకుస్థాపన

by Shamantha N |
PM Modi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ రూ.11 వేల కోట్ల పనులకు శంకుస్థాపన
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ రూ.11,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆదివారం పూణేలో మెట్రో రైలుని వర్చువల్ గా ప్రారంభించారు. సెప్టెంబర్ 26న జరగాల్సిన మోడీ పూణే పర్యటన వర్షం వల్ల రద్దవడంతో పూణే మెట్రో ప్రారంభోత్సవం ఆలస్యం అయ్యింది. పూణే జిల్లా కోర్ట్ మెట్రో స్టేషన్ నుంచి స్వర్గేట్ మెట్రోస్టేషన్ వరకు మార్గాన్ని వర్చువల్ గా మోడీ ప్రారంభించారు. ఆన్ లైన్ లో జెండా ఊపి మెట్రో రైలుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ స్వయంగా ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం 4 గంటల తర్వాత సాధారణ ప్రయాణికులకు మార్గం తెరవబడుతుంది. కాగా.. ఈ ప్రాజెక్టు వల్ల రవాణా రాకపోకలకు మార్గం సుగమనం కానుంది. ఈ మార్గంలో డిస్ట్రిక్ట్ కోర్ట్, కస్బా పేత్, మండై, స్వర్గేట్ అనే 4 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఇది పూణే మెట్రో రైలు ప్రాజెక్ట్ (ఫేజ్-1) పూర్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అదనంగా, పూణే మెట్రో స్వర్గేట్-కట్రాజ్ పొడిగింపు కోసం మోడీ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2,955 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు.

Advertisement

Next Story