బడ్జెట్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

by Harish |   ( Updated:2023-02-01 12:53:26.0  )
బడ్జెట్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు
X

న్యూఢిల్లీ: తొలి 'అమృత్ కాల్' బడ్జెట్‌ను ప్రధాని మోడీ ప్రశంసించారు. అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణానికి ఇది బలమైన పునాది అని అభివర్ణించారు. అణగారిన వర్గాల వారికి, ప్రబలమైన కాంక్ష గల వారికి, రైతులకు, మధ్య తరగతి కుటుంబాలకు తమ కలలను సాకారం చేస్తుందని ప్రధాని అన్నారు.

'తొలి బడ్జెట్ అమృత్ కాల్ అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణానికి గట్టి పునాది వేసింది. అణగారిన వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చింది. రైతులు, మధ్యతరగతి వారు, పేదలు, బలమైన ఆకాంక్ష గల వారి కలలను సాకారం చేస్తుంది. ఇటువంటి చారిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌కు, ఆమె బృందానికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను' అని మోడీ చెప్పారు.

విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ విశ్వకర్మల జీవితాల్లో భారీ మార్పును తెస్తుందని ప్రధాని అన్నారు. వారికి మద్దతుగా తొలిసారి వారికి సంబంధించిన పథకాలను బడ్జె‌ట్‌లో పొందుపరిచామని మోడీ చెప్పారు. 'సంప్రదాయబద్దంగా శ్రమిస్తున్న విశ్వకర్మలు ఈ దేశ సృష్టి కర్తలు. విశ్వకర్మకు శిక్షణ, మద్దతుకు సంబంధించిన పథకాన్ని తొలిసారి బడ్జెట్‌లో పొందుపరిచాం. వారి శిక్షణ, సాంకేతికత, మార్కెటింగ్ కోసం సన్నాహాలు చేశాం' అని ప్రధాని వివరించారు. మహిళల జీవితాలను మెరుగు పరిచే తమ ప్రభుత్వం ప్రయత్నాలను కూడా ప్రధాని మోడీ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed