ఇస్రో చీఫ్ సోమనాధ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ (వీడియో)

by Mahesh |   ( Updated:2023-08-24 12:07:40.0  )
ఇస్రో చీఫ్ సోమనాధ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్ అవుతున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో విక్షించిన ప్రధాని మోడీ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలకు లైవ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భారత కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా చంద్రయాన్-3 మిషన్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్క భారతీయుడుకి కూడా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అలాగే లైవ్ ముగిసిన వెంటనే.. సౌత్ ఆఫ్రికా టూర్ లో ఉన్న ప్రధాని మోడీ.. జోహన్నెస్‌బర్గ్ నుంచి ఇస్రో చీఫ్ సోమనాధ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More..

చంద్రుడిపై ల్యాండ్ అయిన చంద్రయాన్-3.. తర్వాత ఏమి చేయనుందంటే..?

చంద్రయాన్- 3 సక్సెస్‌తో నా జీవితం ధన్యం: ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story