- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్పీజీ సిలిండర్లపై రూ.100 తగ్గింపు.. ‘ఉజ్వల’ సిలిండర్ రూ.500 మాత్రమే
దిశ, నేషనల్ బ్యూరో : మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుడ్‌న్యూస్ చెప్పారు. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.100 ధర తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోడీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ నిర్ణయంతో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.803కి, ముంబైలో రూ.802.50, కోల్‌కతాలో రూ.829 , చెన్నైలో రూ.818.50కి తగ్గింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాల్లో సిలిండర్ ధరలు ఒక్కో విధంగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే దేశీయంగా తగ్గింపు చేశారని తెలుస్తోంది.
2025 మార్చి వరకు ‘ఉజ్వల’ రాయితీ
‘‘ఢిల్లీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రూ.300 రాయితీ పొందుతున్న వారికి సిలిండర్ రూ.503కే లభించనుంది. మిగతావారు దీన్ని రూ.803కు పొందొచ్చు’’ అని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర క్యాబినెట్.. ఉజ్వల రాయితీని 2025 మార్చి వరకు పొడిగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2023 అక్టోబరులోనే ప్రభుత్వం ఈ సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కు పెంచింది. ఇక ప్రస్తుతానికి పెట్రోలు, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. గత 23 నెలలుగా అవి స్థిరంగానే కంటిన్యూ అవుతున్నాయి.
గత ఆరు నెలల్లో ఇది రెండోసారి..
గత ఆరు నెలల్లో వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర సర్కారు తగ్గించడం ఇది రెండోసారి. గతేడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కో సిలిండర్‌పై కేంద్రం రూ.200 మేర తగ్గించింది. దీంతో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1,103 నుంచి రూ.903కు దిగొచ్చింది. తాజాగా మరో రూ.100 తగ్గించటంతో అది రూ.803కు చేరింది.2021 జులై నుంచి 2023 ఆగస్టు మధ్య 14.2 కిలోల సిలిండర్ ధర రూ.294 పెరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్.. అధికార పార్టీపై విమర్శలకు దీన్ని అస్త్రంగా మార్చుకుంది. ఈనేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సామాన్య వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై మోడీ సర్కారు ఫోకస్ పెట్టింది.