- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : తొమ్మిది మంది పిల్లల మరణవార్త విని కలతచెందా : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా షాపూర్‌లో హర్దౌల్ బాబా ఆలయంలో గోడ కూలడంతో 9 మంది పిల్లలు చనిపోయారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన గురించి తెలిసి తనకు తీవ్ర ఆవేదన కలిగిందని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ వేదనను తట్టుకునే బలాన్ని వారికి భగవంతుడు ప్రసాదించాలని ప్రధాని ఆకాంక్షించారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మోడీ చెప్పారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని మోడీ ప్రకటించారు. ఈవివరాలను పీఎంవో కూడా ధ్రువీకరించింది.ఇక ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ట్వీట్ చేశారు. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు ఈ విషాదాన్ని తట్టుకునే బలమివ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.