- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోర్న్ వీడియోలను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో పిల్
దిశ, నేషనల్ బ్యూరో: సమాజంలో లైంగిక నేరాలకు కారణమవుతున్న పోర్న్(అశ్లీల) వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని సంజయ్ కులశ్రేష్ట్ర అనే పిడియాట్రిక్ సర్జన్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. మొబైల్ ఇంటర్నెట్ ద్వారా పోర్న్‌ను సులభంగా యాక్సెస్ చేయడం లైంగిక ప్రవర్తనను వక్రీకరించడమేకాకుండా మైనర్ బాలికలపై లైంగిక నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేరాల నియంత్రణకు కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమాచార సాంకేతిక చట్టం కింద తమ అధికారాన్ని ఉపయోగించుకుని అసభ్యకరమైన, అశ్లీలతకు సంబంధించిన అంశాలు/వీడియోలను తమ వేదికల్లో హోస్ట్ చేయడం, ప్రదర్శించడం, అప్‌లోడ్ చేయడం వంటివాటిని నియంత్రించేలా సోషల్ మీడియా సంస్థలను నిర్దేశించాలని, ఆ దిశగా చర్యలకు కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌లో కేంద్ర సమాచార సాంకేతిక, హోం వ్యవహారాలు, మహిళలు, చిన్నారుల అభివృద్ధి మంత్రిత్వశాఖలను ప్రతివాదులుగా చేర్చారు. పోర్న్ వీడియోలు చూడటం వల్లే స్త్రీలపై లైంగిక వేధింపుల పట్ల పురుషులలో సాధారణమైన వైఖరి పెరుగుతోందని పిల్‌లో పేర్కొన్నారు.