- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయ్ : కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి
దిశ, నేషనల్ బ్యూరో : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని వస్తున్న కథనాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం స్పందించారు. అవన్నీ అవాస్తవాలే అని.. అసత్య ప్రచారాలను నమ్మొద్దని దేశప్రజలకు సూచించారు. ధరల పెరుగుదలకు సంబంధించిన వార్తలను ఖండించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ( హమాస్, హిజ్బుల్లా-ఇజ్రాయెల్ యుద్ధం) కారణంగా చమురు సరఫరాలో కొరత ఏర్పడి క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయని.. ఫలితంగా మరోసారి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వార్తలొస్తున్నాయి.
ఈ క్రమంలోనే కేంద్రమంత్రి స్పందిస్తూ.. మిడిల్ ఈస్ట్‌లో అశాంతి కారణంగా చమురు సరఫరాలో ఎటువంటి కొరత లేదని.. కావాల్సిన దానికంటే ఎక్కువే అందుబాటులో ఉందని స్పష్టంచేశారు. బ్రెజిల్, గయానా వంటి దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా పెరిగిందని, ఫలితంగా చమురు మార్కెట్లో గణనీయ మార్పులు రావొచ్చన్నారు. ఇదిలాఉండగా, రష్యా, ఇరాన్ నుంచి భారత్ అధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇతర దేశాల నుంచి కూడా చమురును దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా దేశంలో చమురు నిల్వలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో సమీప భవిష్యత్‌లో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్రమంత్రి హింట్ ఇచ్చారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 73 డాలర్లుగా ఉంది.