రతన్ టాటా భౌతికకాయం వద్ద పెంపుడు కుక్క కన్నీరు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-10 11:44:08.0  )
రతన్ టాటా భౌతికకాయం వద్ద పెంపుడు కుక్క కన్నీరు
X

దిశ, వెబ్ డెస్క్ : దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు బంధువులు, అభిమానులు, ప్రముఖుల కడసారి కన్నిటీ వీడ్కోలు మధ్య అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అయితే రతన్ టాటా అంత్యక్రియల సందర్భంగా ఆయన పెంపుడు కుక్క తన యాజమాని కోసం కన్నీటి పర్యంతమైన ఘటన అందరిని కలచివేసింది. రతన్ టాటా భౌతికకాయం వద్ద పెంపుడు కుక్క దీనంగా విలపిస్తున్న దృశ్యం చూసిన వారంతా యాజమాని దూరమైన బాధతో ఆ కుక్క పడిన వేదనను చూసి చలించిపోయారు. రతన్ టాటాతో కుక్కకు ఉన్న బంధాన్ని తలచుకుని అది చూపిన విశ్వాసాన్ని ప్రశంసించారు. ముంబయి వర్లి శ్మశాన వాటికలో రతన్‌ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది ప్రజలు, పలువురు ప్రజాప్రతినిధులు అంతిమ యాత్రలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అంతిమ యాత్రలో భారత ప్రభుత్వం తరుపున కేంద్రమంత్రి అమిత్​ షా సహా వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. రతన్ టాటా మృతి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంతాప దినం ప్రకటించింది.

Advertisement

Next Story