యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియోను షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

by Disha Web Desk 17 |
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియోను షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీప్‌ఫేక్ వీడియోల వ్యవహరం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు దీని బారీన పడగా, లోక్‌సభ ఎన్నికల వేళ ఈ వ్యవహరం మరింత హట్ టాపిక్ అయింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా దీని బారీన పడ్డారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేయగా, తాజాగా గురువారం ఆదిత్యనాథ్‌‌కు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోను పోస్ట్ చేసినందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నోయిడాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

మే 1న, AI- ద్వారా రూపొందించిన యూపీ సీఎం డీప్‌ఫేక్ వీడియో ఒక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ వీడియోలో తప్పుదోవ పట్టించే వాస్తవాలను వ్యాప్తి చేయడానికి, దేశ వ్యతిరేక అంశాలను బలోపేతం చేయడానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని, గురువారం నిందితుడు శ్యామ్ కిషోర్ గుప్తాను అరెస్టు చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమితాబ్ యాష్ తెలిపారు. నిందితునిపై నోయిడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో, ఐపీసీ సెక్షన్లు 468, 505(2), ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

Next Story

Most Viewed