ప్రధాని సభకు అనుమతి నిరాకరణపై బీజేపీ ఫైర్

by S Gopi |
ప్రధాని సభకు అనుమతి నిరాకరణపై బీజేపీ ఫైర్
X

షిల్లాంగ్: మేఘాలయ ప్రభుత్వం ప్రధాని మోడీ ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సీఎం కాన్రడ్ సంగ్మాను ప్రజలెప్పుడూ అసహ్యహించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. భయంతో కూడిన అభద్రత భావం ఉన్న సీఎం సంగ్మా ఆదేశాలతో డైరక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ ఎఫైర్స్ పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని మోడీ ర్యాలీకి అనుమతి నిరాకరించారని మంగళవారం ప్రకటన విడుదల చేసింది. పౌరులతో కలిసి ప్రధాన మంత్రిని కూర్చోనివ్వకుండా చేయడం బాధకరం, దురదృష్టకరమని బీజేపీ ప్రతినిధి బెర్నాడ్ మరక్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా చేశారని ఆరోపించారు. పర్వత ప్రాంత ప్రజలు సీఎం నిర్ణయాన్ని అసహ్యించుకుంటారని చెప్పారు. కాగా, రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ ర్యాలీ నిర్వహించేందుకు నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కాన్రడ్ సంగ్మా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని సంగ్మా చెప్పారు.

Advertisement

Next Story