కుక్కలకు ఆధార్ కార్డులు.. ఎక్కడో, ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

by Disha Web Desk 9 |
కుక్కలకు ఆధార్ కార్డులు.. ఎక్కడో, ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌ల కంటే ఆధార్‌కార్డుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనడంలో సందేహం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు, ఇతర సేవలను పొందడంలో కూడా ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఇది కార్డుదారుని వేలిముద్రలు అండ్ ఐరిష్ స్కాన్‌తో అనుసంధానించబడి ఉంటుంది. యూఐడీఏఐ ఆధార్ కార్డును జారీ చేస్తుంది. ఇది పౌరసత్వానికి కాకుండా గుర్తింపుకు రుజువుగా పనిచేస్తుంది. అయితే ఎక్కడైనా సరే మనుషులకు ఆధార్ కార్డులు ఉండటం చూస్తాం.

కానీ వింతగా తాజాగా కుక్కలకు కూడా ఆధార్ కార్డులు ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అండ్ జనాలకు తెగ నవ్వు తెప్పిస్తోంది కూడా. ఇకపోతే తాజాగా ఢిల్లీలో Pawfriend.in అనే NGO కుక్కలకు ఆధార్ కార్డులు తయారు చేయించి ఇప్పటికే 100 కుక్కలకు జారీ చేసింది. ఇండియా గేట్, ఎయిర్‌పోర్ట్‌లోని టర్మినల్ 1 సహా పలు ప్రాంతాల్లోని కుక్కలకు ఆధార్ కార్డులు మెడలో వేశారు. కాగా వీధి కుక్కల సంరక్షణకు ఇదో మంచి పరిష్కారమని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఎప్పుడైనా కుక్కలు తప్పిపోయిన, ఎవరిపైనన దాడి చేసినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుక్క ఏ వీధికి చెందినదో తెలుస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Next Story

Most Viewed