- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Parliament: ఈ నెల 25 నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్.. కీలక బిల్లులు ప్రవేశపెట్టే చాన్స్
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran rijiju) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్(Samvidhan central hall)లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ (One nation One election) సవరణ బిల్లు, వక్ఫ్ (Waqf) సవరణ బిల్లు-2024పై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వక్ఫ్ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఇప్పటికే సందేహాలను పరిష్కరించేందుకు, బిల్లుపై ఉమ్మడి ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి వివిధ రాష్ట్రాలతో పాటు పలువురు ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ రెండు బిల్లులు ఉభయ సభల్లో ప్రవేశపెట్టే చాన్స్ ఉంది. అయితే జమిలీ ఎన్నికలను అమలు చేయాలనే ఆలోచనను ప్రతిపక్ష కాంగ్రెస్ తిరస్కరించింది. అలాగే వక్ప్ బిల్లుపైనా పలు సందేహాలను వ్యక్తం చేసింది. దీంతో రానున్న శీతాకాల సమావేశాలు గందరగోళంగా సాగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.