- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Parliament: ఉభయసభలు నిరవధిక వాయిదా
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఉభయసభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 29 వరకు జరగాల్సి ఉన్నా.. ఆరు రోజులు ముందే ముగిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు. 62 గంటల 42 నిమిషాల పాటు లోక్‌సభలో కార్యక్రమాలు జరిగినట్టుగా స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నేత సోనియాగాంధీ సహా తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే, ఇటీవలే స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సెషన్‌ను త్వరగా ముగించేలా సిఫారసు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని సమావేశాలను ముందుగానే ముగించాలని పలువురు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. కాగా, డిసెంబర్ 7న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29న జరగాల్సి ఉండగా..నేటితో సమావేశాలు ముగిశాయి.