Imran Khan: మరోసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

by S Gopi |
Imran Khan: మరోసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెండోసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. పాకిస్తాన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి గాను ఆయన ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యారు. పాకిస్థాన్ వరల్డ్ అలయెన్స్ (పీడబ్ల్యూఏ) అనే సంస్థతో కలిసి ఈ నామినేషన్ వేయడం సంతోషంగా ఉందని నార్వేలోని రాజకీయ పార్టీ పార్టియట్ సెంట్రం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షం పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్‌(పీటీఐ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్‌ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి పాల్పడ్డారనే కేసు కారణంగా గతేడాది జనవరిలో ఆయనకు 14 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పువెలువడింది. ఇమ్రాన్‌పై మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా, దీనికి ముందు ప్రభుత్వ బహుమతులు అమ్ముకున్నారని, రహస్యాలను లీక్ చేశారని, అక్రమ వివాహం ఆరోపణల కేసులున్నాయి. ఈ మూడు కేసులు రద్దవ్వగా, అధికార దుర్వినియోగం, అవినీతి కేసులో దోషిగా తేల్చారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, రాజకీయ దురుద్దేశాలతోనె తనపై కేసు పెట్టారని ఇమ్రాన్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed