- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువరాజు ప్రధాని కావాలని పాక్ కోరుకుంటోంది: ప్రధాని మోడీ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: పాక్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. యువరాజును ప్రధానిని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోందని విమర్శించారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ‘దేశంలో కాంగ్రెస్ బలహీనంగా తయారవుతోంది. ఇక్కడ కాంగ్రెస్ చనిపోతుంటే అక్కడ పాకిస్థాన్ ఏడుస్తోంది. కాంగ్రెస్ కోసం పాకిస్థానీయులు ప్రార్థనలు చేస్తున్నారు. యువరాజును ప్రధాని చేయాలని కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాకిస్థాన్‌కు అభిమాని అని దేశ ప్రజలకు ఎప్పుడో తెలుసని ఆరోపించారు. పాక్, కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న భాగస్వామ్యం ఇప్పుడు బహిర్గతమైందని తెలిపారు.
పాకిస్థాన్‌లో ఉగ్రవాదం కనుమరుగై పోయిందని తెలిపారు. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిన దేశం నేడు పిండిని కూడా దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. టెరర్రిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమరి వారి ఇళ్లలోకిప్రవేశించి మరీ ఉగ్రవాదులను మట్టుపెడతామని హెచ్చరించారు. 2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి 24గంటలూ పని చేస్తానని హామీ ఇచ్చారు. పదేళ్లలో 14కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ 60ఏళ్లలో కేవలం మూడు కోట్ల ఇళ్లకు మాత్రమే నీరు అందించిందని చెప్పారు.