Pakistan blast: పాక్‌లో బాంబు దాడి..14 మంది సైనికులు సహా 25 మంది మృతి

by vinod kumar |
Pakistan blast: పాక్‌లో బాంబు దాడి..14 మంది సైనికులు సహా 25 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌( Balochistan Praveens)లో ఉన్న క్వెట్టా రైల్వే స్టేషన్‌(uetta railway station)పై శనివారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 14 మంది ఆర్మీ సైనికులు(Army soldiers) సహా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్వెట్టా నుంచి గార్రిసన్ సిటీ రావల్పిండికి వెళ్లేందుకు ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో బాంబు పేలినట్టు సీనియర్ పోలీసు అధికారి మహ్మద్ బలోచ్ తెలిపారు. ప్రమాదం సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై నుంచి పెషావర్‌కు వెళ్లేందుకు ఓ రైలు సిద్ధంగా ఉందని చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పేలుడు జరిగిన టైంలో ప్లాట్‌ఫాంపై 100 మందికి పైగా ఉన్నారని, అత్యంత రద్దీగా ఉన్న టైంలోనే దుండగులు దాడికి పాల్పడ్డారని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఈ పేలుడు ధాటికి ప్లాట్ ఫాం పై కప్పు తీవ్రంగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడిని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. బాంబర్ సామానుతో స్టేషన్‌లోకి ప్రవేశించాడని, అందుకే ఆయనను ఆపలేకపోయారని క్వెట్ట డివిజన్ కమిషనర్ హమ్జా షఫ్కాత్ తెలిపారు. కానీ దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ దాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahabaj shareef) స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అలాగే బలూచిస్థాన్ ప్రావీన్స్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీ (Sarfaraj bugthee) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. బాధ్యులను విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

దాడికి పాల్పడింది మేమే: బీఎల్ఏ

రైల్వే స్టేషన్ లో దాడికి పాల్పడింది తామేనని వేర్పాటు వాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) తెలిపింది.స్టేషన్‌లోని పాక్ ఆర్మీ యూనిట్‌పై దాడి చేశామని పేర్కొంది. ప్రభుత్వం బలూచిస్థాన్ వనరులను దోపిడీ చేస్తోందని, ప్రావీన్స్ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించింది. కాగా, గతంలోనూ బీఎల్ఏ అనేక దాడులకు పాల్పడింది. గత నెలలో దుక్కి జిల్లాలో బొగ్గు గని వద్దకు చేరుకుని అక్కడ పని చేస్తున్న 20 మంది కార్మికులను చంపారు. అంతేగాక పోలీసు స్టేషన్లు, రైల్వే లైన్లపై దాడులకు తెగపడింది. అయితే బలూచిస్థాన్ ప్రావీన్సులో అధికంగా ఉన్న వనరులను తీసుకెళ్లి ఇక్కడి ప్రాంత అభివృద్ధిని మాత్రం ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని బీఎల్ఏ పదే పదే ఆరోపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed