సీఎంతో మా సమావేశం అందరూ చూడాలన్నదే మా డిమాండ్: డా. అనురాగ్ మండల్

by Mahesh |
సీఎంతో మా సమావేశం అందరూ చూడాలన్నదే మా డిమాండ్: డా. అనురాగ్ మండల్
X

దిశ, వెబ్ డెస్క్: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు గత నెల రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీతో వారు చర్చించడానికి లేఖ రాశారు. దీంతో సీఎం వారితో చర్చలకు సిద్ధం అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం సీఎంతో 30 మంది జూనియర్ డాక్టర్లు చర్చకు వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో కేవలం 15 మందికి మాత్రమే అనుమతిస్తామని..లైవ్ స్ట్రీమింగ్ కాకుండా పూర్తి సమావేశాన్ని రికార్డ్ చేయిస్తామని అధికారులు తెలిపారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జూనియర్ డాక్టర్ల బృందం.. సచివాలయం ముందే నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం సీఎం స్పందిస్తూ.. ప్రజల కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. సీఎం ని కలవడానికి వెళ్లిన జూనియర్ డాక్టర్లలో ఒకరైన అనురాగ్ మండల్ ప్రస్తుత ఇష్యూ పై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మా సమావేశం అందరి ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాకు రికార్డింగ్ వద్దు.. ఎందుకంటే ఎదైన రికార్డింగ్‌ని ఎడిట్ చేయవచ్చు. మాకు న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరి ముందు ప్రత్యక్ష ప్రసారం ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందుకే మేము సీఎంతో చర్చకు వెళ్లకుండ ఉన్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed