మోడీ గ్యారంటీతో ప్రతిపక్షాలు భయపడుతున్నాయి: బిహార్ ర్యాలీలో ప్రధాని విమర్శలు

by samatah |
మోడీ గ్యారంటీతో ప్రతిపక్షాలు భయపడుతున్నాయి: బిహార్ ర్యాలీలో ప్రధాని విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ కీ గ్యారంటీని చూసి విపక్షాలు భయపడిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ప్రజలకు ఇలాంటి వాగ్దానాలు చేయకుండా తనను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీహార్‌లోని నవాడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్న భాష దేశాన్ని విభజించాలనుకునే వ్యక్తుల ఆలోచనను ప్రతిబింబిస్తుందన్నారు. ఆర్టికల్ 370 పై ఇటీవల ఖర్గే చెప్పిన మాటలు విని తాను సిగ్గుపడుతున్నానన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని హామి ఇచ్చి దానిని నెరవేర్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బుజ్జగింపు రాజకీయాలు ఉన్నాయని, అంతేగాక దానిని ముస్లిం లీగ్ బయటకు తీసుకొచ్చినట్టుగా అనిపిస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజా విరాళాలతో రామమందిరాన్ని నిర్మించినప్పటికీ వారు ప్రాణ ప్రతిష్ట వేడుకకు హాజరుకాలేదన్నారు. ప్రజల పట్ల ఇండియా కూటమి నేతలకు ఇంత విద్వేషం ఉండటం చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఈ కూటమిలోని పార్టీలన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని, దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని వాదిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్-ఆర్జేడీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తుక్డే తుక్డే గ్యాంగ్ అవినీతికి బానిసలుగా మారారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వీరికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed