- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బుమ్రా..ఒకే ఒక్కడు!
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో అందరి దృష్టి భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా పైనే ఉందనడంలో అతిశయోక్తి లేదు. అన్ని జట్లలోనూ అద్భుతమైన పేసర్లు ఉన్నప్పటికీ భారత పేసర్ బుమ్రాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం అతనికి మాత్రమే చెల్లుతుంది. యార్కర్లతో చెలరేగిపోతాడు. అతడు విసిరే బంతులను అడ్డుకోవడం హేమాహేమీలకే సాధ్యం కానడంలో సందేహం లేదు.
తాజాగా బుమ్రా బౌలింగ్ సామర్థ్యంపై ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ స్పందించారు. డెత్ ఓవర్లలో బుమ్రా బౌలింగ్ పదును మరింత ఎక్కువగా ఉంటుందని, అతన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు పెను సవాల్‌గా మారబోతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు.
‘ఈ మధ్యకాలంలో బుమ్రా వలే నిలకడగా యార్కర్లు వేసిన బౌలర్ ఎవరైనా ఉంటే చూపించండి. అతడిలా మరికొందరు యార్కర్లు వేయడం చూడాలని ఉంది. కొందరు యార్కర్లు వేస్తున్నా..డెత్ ఓవర్లలో వారి పేస్ అంతంత మాత్రంగానే ఉందనేది నా అభిప్రాయం.2024 ఐపీఎల్ సీజన్‌లో 200+ స్కోర్లు చాలా సార్లు నమోదయ్యాయి. గతంలో 180 నుంచి 200 కొడితే చాలా బెటర్ స్కోర్‌గా భావించేవాళ్లం. కానీ, ఇప్పుడు 260+ బాదినా గెలుస్తామో లేదో అనే అనుమానం. ఇదంతా పేసర్లు వైవిధ్యంగా బంతులు వేయలేకపోవడం వల్లే జరుగుతోంది. స్కూప్ షాట్లతో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలనుకునే బ్యాటర్లను ఎదుర్కోవాలంటే యార్కర్లే కీలకం. స్కూప్ షాట్స్ ఆడాలనుకునే వారికి వైవిధ్యమైన యార్కర్లు విసిరితే బెంబెలెత్తిపోతారు.ఫలితంగా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయొచ్చు.ఈ సారి బుమ్రా ప్రత్యర్థి జట్లపై తన విశ్వరూపం చూపిస్తాడు’ అని బ్రెట్ లీ వెల్లడించారు.