One Nation, One Election: వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి క్యాబినెట్ ఆమోదం

by Shamantha N |   ( Updated:2024-09-18 10:26:34.0  )
One Nation, One Election: వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి క్యాబినెట్ ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి ఆమోదించింది. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ బుధవారం కేంద్ర కేబినెట్‌కు నివేదిక సమర్పించింది. ఆతర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని కమిటీ పేర్కొంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి జరుగుతోందని.. దీంతో, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందని వెల్లడించింది. ఏకకాల ఎన్నికల వల్ల కార్పొరేట్ సంస్థలు ప్రతికూల విధాన మార్పులకు భయపడకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందంది.

జమిలి ఎన్నికలు అంటే?

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని జమిలి ఎన్నికలు అంటారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే ఆలోచన 1980ల్లో మొదటిసారిగా తెరపైకి వచ్చింది. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో 170వ నివేదికలో "లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు చేపట్టాలి" అని పేర్కొంది. కాగా.. 1951-52, 1957, 1962, 1967లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జరిగాయి. అయితే, అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయడం వల్ల రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు అస్తవ్యస్తమైంది. లోక్‌సభ కూడా 1970 ప్రారంభంలోనే రద్దు చేశారు. దీంతో, జమిలి ఎన్నికలు సాధ్యపడలేదు.

వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మరియు శివసేన (UBT)తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. పార్లమెంటరీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి వ్యవస్థతో భర్తీ చేయడానికి బీజేపీ ఏకకాల ఎన్నికలను ప్రతిపాదిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ప్రతిపాదనను ఆమోదించడంతో కేంద్రంపై టీఎంసీ ఎంపీ విమర్శలు గుప్పించారు. “ఒక దేశం- ఒక ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీ నుండి వచ్చిన మరొక చౌకబారు స్టంట్ మాత్రమే” అని ఫైర్ అయ్యారు. ఇకపోతే, బీజేపీ మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల హామీ ఉంది. ఈఏడాది స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదోఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనినుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఎన్డీయే సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు అమలుచేస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టం చేశారు.

Read More:

జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం



Advertisement

Next Story

Most Viewed