మరోసారి ఎన్డీయే వర్సెస్ ఇండియా పోరు..ఆ నియోజకవర్గం పైనే ఉత్కంఠ

by vinod kumar |
మరోసారి ఎన్డీయే వర్సెస్ ఇండియా పోరు..ఆ నియోజకవర్గం పైనే ఉత్కంఠ
X

దిశ, నేషనల్ బ్యూరో: 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉపఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ బైపోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే లోక్ సభ ఎన్నికలు ముగిసిన అనంతరం మరోసారి ఎన్డీయే వర్సెస్ ఇండియా తలపడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో హోరా హోరీగా సాగిన పోరులో ఎన్డీయే పై చేయి సాధించింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఎన్డీయే సత్తా చాటుతుందా లేక ఇండియా కూటమి పట్టు నిలుపుకుంటుందా అన్నది ఆసక్తి కరంగా మారింది. ప్రస్తుతం బై పోల్స్ జరగనున్న నియోజకవర్గాల్లో బిహార్ లోని రూపాలీ, పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్దా, తమిళనాడులోని విక్రవాండి, మధ్యప్రదేశ్‌లోని అమరవారా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళూర్, పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్, హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా, హమీర్‌పూర్, నలాగర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎమ్మెల్యేల మరణం, వివిధ పార్టీల్లో చేరి రాజీనామాలు చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి.

హిమాచల్‌లోని డెహ్రాపైనే అందరి దృష్టి

హిమాచల్ ప్రదేశ్‌లో డెహ్రా, హమీర్‌పూర్, నలాగఢ్‌లకు ఎన్నికలు జరగనుండగా డెహ్రా నియోజకవర్గంపైనే అం దరూ దృష్టి సారించారు. ఎందుకంటే ఇక్కడి నుంచి సుఖ్వింధర్ సింగ్ సుఖూ భార్య కమలేష్‌ ఠాకూర్‌ బరిలో నిలిచారు. దీంతో ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. అలాగే ఈ మూడు స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను నిలిపింది. అయితే వారు సభలో అనర్హత వేటుకు గురికావడం గమనార్హం. ఈ ఉపఎన్నికలు హిమాచల్ రాజకీయాలను కుదిపిస్తాయని బీజేపీ పేర్కొంటుండగా, సభలో 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయబోదని కాంగ్రెస్ చెబుతోంది.

తమిళనాడు ఫలితాలపై ఆసక్తి

ఈ ఏడాది ఏప్రిల్‌లో డీఎంకే సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎన్‌ పుఘజెంతీ మృతి చెందడంతో విక్రవాండి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటులో అధికార డీఎంకే, పీఎంకే, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికను బహిష్కరించాలని అన్నాడీఎంకే నిర్ణయించుకుంది. అయితే 50 మందికి పైగా మరణించిన కళ్లకురిచి హూచ్ విషాదం డీఎంకేకు వ్యతిరేకంగా పని చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story