- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి మాదే అధికారం: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ధీమా
ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సీఎం బీరెన్ సింగ్ అన్నారు. శాంతి, అభివృద్ధి, సమైక్యత ఎజెండాగా మణిపూర్‌లో బీజేపీకి బరిలోకి దిగుతుందని చెప్పారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల ప్రణాళిక పై జాతీయ మీడియాతో మాట్లాడారు. 'మణిపూర్ ఒకప్పుడు అశాంతి, హింస, బంద్ (సమ్మె)లతో అపఖ్యాతి పాలైంది. సాయంత్రం 5 గంటలకే దుకాణాలన్నీ మూతపడేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇది మేము సాధించిన విజయం' అని అన్నారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
'క్రితం సారి మా ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈ సారి బీజేపీ సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తుంది. నేను దీనిపై నమ్మకంగా ఉన్నాను. మొత్తం 60 సీట్లలో 40 సీట్లు బీజేపీ గెలుచుకొని సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తుంది' అని ధీమాగా చెప్పారు. 2017లో ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను అనుసరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కూటమి భాగస్వాములందరినీ కలిసి ఉంచుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని నొక్కి చెప్పారు.