ఆరు నెలల్లో ఒమిక్రాన్‌కు వ్యాక్సిన్: అదర్ పునావాలా

by Hajipasha |   ( Updated:2022-08-15 17:15:17.0  )
ఆరు నెలల్లో ఒమిక్రాన్‌కు వ్యాక్సిన్: అదర్ పునావాలా
X

న్యూఢిల్లీ: సీరం చీఫ్ అదర్ పునావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్‌కు ప్రత్యేకించి వ్యాక్సిన్ తయారు చేయడంలో నొవావాక్స్‌తో కలిసి తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ బీఏ.5 ఉపవేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. మరో ఆరు నెలల్లో టీకా రానున్నట్టు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ బూస్టర్ కంటే ముఖ్యమైనదిగా భావిస్తున్నామని చెప్పారు. ఒమిక్రాన్ కాస్తా తీవ్రమైన జ్వరంగా ఉందని చెప్పారు.

అయితే వ్యాక్సిన్ భారత మార్కెట్‌లోకి ప్రవేశించడం దేశీయ రెగ్యులేటర్ క్లియరెన్స్ పొందడంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేక క్లినికల్ ట్రయల్ అవసరమనే విషయమై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు. నొవావాక్స్ ట్రయల్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సాగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది చివరి కల్లా యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ ను సంప్రదించే పరిస్థితి ఉందని అన్నారు. కాగా ఢిల్లీలో ఒమిక్రాన్ ఉప వేరియంట్ కేసులు పెరుగుదల ఉంది. కొత్త కేసుల్లో దాదాపు 20 నుంచి 30 శాతం ఇవే ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.

మోడార్నా వ్యాక్సిన్‌కు యూకే ఔషధ నియంత్రణ ఆమోదం

Advertisement

Next Story