Omar Abdullah : బీజేపీతో పొత్తుకు పాకులాడిన ఒమర్ అబ్దుల్లా.. నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ నేత సంచలన వ్యాఖ్యలు

by Hajipasha |
Omar Abdullah : బీజేపీతో పొత్తుకు పాకులాడిన ఒమర్ అబ్దుల్లా.. నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీతో కలిసి జమ్మూకశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఒక దశలో ఒమర్ అబ్దుల్లా భావించారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నేత దేవేందర్ సింగ్ రాణా తెలిపారు. 2014లో ఈ దిశగా ఒమర్ అబ్దుల్లా ముమ్మర ప్రయత్నాలు చేశారని, రాయబారాలు నడిపారని ఆయన సంచలన వివరాలను వెల్లడించారు. బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు సీనియర్ నేత అమిత్‌షా, ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత రాం మాధవ్‌లతోనూ ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారని చెప్పారు.

‘‘నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి అప్పట్లో కేవలం 15 అసెంబ్లీ సీట్లే వచ్చాయి. దీంతో తమతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురావాలని అమిత్‌షా, రాంమాధవ్‌లను ఒమర్ అబ్దుల్లా కోరారు. అయితే అందుకు బీజేపీ నో చెప్పింది’’ అని దేవేందర్ సింగ్ రాణా వివరించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కశ్మీర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఒమర్ అబ్దుల్లా యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed