- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమానం గాల్లో ఉండగా కాక్ పిట్ లోకి గర్ల్ ఫ్రెండ్!
దిశ, డైనమిక్ బ్యూరో: విమానం గాలిలో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్ ఇండియా విమానం పైలట్ తన స్నేహితురాలిని కాక్ పిట్లోకి ఆహ్వానించడం కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ ప్రారంభించింది. గత ఫిబ్రవరి 27న దుబాయి నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరింది. ఈ విమానంలో తన స్నేహితురాలు ప్రయాణిస్తుందని తెలుసుకున్న పైలట్ విమానం గాలిలో ఉన్న సమయంలో తన స్నేహితురాలిని కాక్ పిట్లోకి ఆహ్వానించాడు. దాదాపు మూడు గంటల పాటు ఆమె కాక్ పిట్ లోనే గడిపింది.
కాక్ పిట్ లోకి పైలట్, కో పైలట్ మినహా ఇతరులను అనుమతించడం నిబంధనలను ఉల్లఘించడమే కాకుండా విమానంలోని ప్రయాణికుల భద్రత విషయాన్ని గాలిలోకి వదిలేయడమే అవుతుంది. పైలట్ వ్యవహరించిన తీరుపై విమానం సిబ్బందియే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఐ విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం రూల్స్ బ్రేక్ చేసిన సదరు పైలట్‌పై క్రమశిక్షణ చర్యలతో పాటు అతని లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇటీవల ఎయిర్ ఇండియా విమానాలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో ఎయిర్ ఇండియా తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.