NSG director: ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా శ్రీనివాసన్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

by vinod kumar |
NSG director: ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా  శ్రీనివాసన్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి బీ శ్రీనివాసన్‌ను నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకానికి కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆమోదించినట్టు తెలిపింది. శ్రీనివాసన్ బీహార్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన రాజ్‌గిర్‌లోని బీహార్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎన్ఎస్‌జీ డీజీ నళిన్ ప్రభాత్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న శ్రీనివాసన్ ..2027 ఆగస్టు 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎన్ఎస్‌జీ డీజీగా పని చేస్తున్న నళిన్ ప్రభాత్ పదవీకాలాన్ని కేంద్ర ఇటీవల తగ్గించింది. ఆయనను జమ్మూ కశ్మీర్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించింది. అనంతరం సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్‌కి ఎన్ఎస్‌జీ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసన్‌ను డీజీగా అపాయింట్ చేసింది.

Advertisement

Next Story