- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఎంక్వయిరీకి రావాల్సిందిగా పేర్కొన్న అధికారులు ఆదివారం ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. మొట్టమొదటి సారి ఢిల్లీ సీఎంకు ఈ కేసులో నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యక్తిగా సీబీఐ, ఈడీలు భావించినా ఈసారి నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయడంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే అప్రతిష్ట పాలైందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన, విచారణ ఎదుర్కొన్న పలువురు నిందితులు, అనుమానితులు, సాక్ష్యులు పరోక్షంగా కేజ్రీవాల్‌కు ఈ స్కాంలో సంబంధం ఉందని స్టేట్ మెంట్లు ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే సీబీఐ, ఈడీల కస్టడీకి వెళ్లి రికార్డు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ నుంచి అధికారులు ఏ వివరాలను రాబడతారన్నది ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్‌కు, ఎమ్మెల్సీ కవితకు ఆర్థిక, వ్యాపారల సంబంధాలు ఉన్నట్లు మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు లేవనెత్తిన వారం రోజుల వ్యవధిలోనే ఢిల్లీ సీఎంకు సీబీఐ నుంచి నోటీసులు రావడం గమనార్హం. గతంలో డిప్యూటీ సీఎం ఈడీ ఎంక్వయిరీకి వెళ్లడానికి బడ్జెట్ సమావేశాలు అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు సీఎం ఆదివారం హాజరవుతారా లేక వాయిదా కోరుతారా అనేది ఆసక్తిగా మారింది.