Udhayanidhi Stalin: ఉపముఖ్యమంత్రి పదవి కాదు.. బాధ్యత- ఉదయనిధి

by Shamantha N |
Udhayanidhi Stalin: ఉపముఖ్యమంత్రి పదవి కాదు.. బాధ్యత- ఉదయనిధి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉపముఖ్యమంత్రి పదవిపై ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పదవి కాదని.. బాధ్యత అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత ఆయన ఈ విధంగా స్పందించారు. గతంలో రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు అదనంగా ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ శాఖను అప్పగించారు. 'ఉపముఖ్యమంత్రి' అనేది ఒక పదవి కాదని, బాధ్యత అని గ్రహించి.. గౌరవనీయులైన ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో తోటి మంత్రులతో కలిసి పని చేస్తా అని ఉదయనిధి సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.

డీఎంకేపై బీజేపీ విమర్శలు

ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని ఎం కరుణానిధి స్మారకాన్ని సందర్శించారు. చెన్నైలోని గోపాలపురం, సీఐటీ కాలనీలోని పెరియార్‌ స్మారకం, కరుణానిధి ఇంటిని కూడా సందర్శించారు. ఇకపోతే, ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎంగా చేయడాన్ని విమర్శిస్తూ.. బీజేపీ నిప్పులు చెరిగింది. ప్రజలకు ద్రోహం చేయడం, ప్రజాసంక్షేమం కంటే కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని డీఎంకేపై మండిపడింది. డీఎంకే తన కూటమి సభ్యులకు అధికారంలో వాటాను నిరాకరించిందని ఆరోపించారు.

Advertisement

Next Story