North Korea: ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం.. వారం రోజుల్లోనే రెండోది

by vinod kumar |
North Korea: ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం.. వారం రోజుల్లోనే రెండోది
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరకొరియా మరోసారి దూకుడు చర్యలకు దిగింది. ఆ దేశ తూర్పు తీరం వైపుగా బుధవారం పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులు రాజధాని ప్యాంగ్యాంగ్‌కు ఉత్తరాన ఉదయం 6:50 గంటల ప్రాంతంలో ఈశాన్య దిశలో వెళ్లినట్టు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్(జేసీఎస్) తెలిపింది. కొరియా ద్వీపకల్పంలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బ తీసేలా నార్త్ కొరియా వ్యవహరిస్తోంది. ఈ క్షిపణి ప్రయోగాలను రెచ్చగొట్టే చర్యగా భావిస్తున్నాం. అంతేగాక దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని పేర్కొంది. జపాన్ కోస్ట్ గార్డ్ సైతం తాజా ప్రయోగాన్ని ధ్రువీకరించింది. జపాన్ రక్షణ మంత్రి మినోరు కిహారా మాట్లాడుతూ ఒక క్షిపణి ఉత్తర తూర్పు తీరానికి సమీపంలో పడిందని తెలిపారు. ఈ విషయంపై దక్షిణ కొరియాతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

నార్త్ కొరియా వారం రోజుల్లోనే రెండో సారి క్షిపణి ప్రయోగాలు చేపట్టడం గమనార్హం. అంతకుముందు గత గురువారం అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. రెండు నెలల విరామం తర్వాత ఈ చర్యలకు పాల్పడింది. అయితే రష్యా, ఉత్తరకొరియాల మధ్య మధ్య సైనిక సహకారం అధికం అవుతున్న నేపథ్యంలో మాస్కోకు ఎగుమతి చేసేందుకు గాను ఆయుధాలను పరీక్షించేందుకు ఈ ప్రయోగం జరిగి ఉండవచ్చని జేసీఎస్ ఆరోపించింది. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రష్యా భద్రతా అధికారి సెర్గీ షోయిగును మాస్కోలో కలిసిన కొద్ది రోజుల తర్వాత క్షిపణి పరీక్షలు జరగడం ప్రాధాన్యత సంతరిచుకుంది.

Advertisement

Next Story

Most Viewed