North Korea army: యుద్ధంలో శత్రువులను పూర్తిగా అంతమొందిస్తాం..ఉత్తర కొరియా సైనికాధికారుల ప్రతిజ్ఞ!

by vinod kumar |
North Korea army: యుద్ధంలో శత్రువులను పూర్తిగా అంతమొందిస్తాం..ఉత్తర కొరియా సైనికాధికారుల ప్రతిజ్ఞ!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, దక్షిణ కొరియాలతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్తర కొరియా సైనికాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశిస్తే తమ శత్రువులను పూర్తిగా నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్టు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ తెలిపింది. 71వ ఉత్తర కొరియా యుద్ధ విరమణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో కిమ్ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో ఆర్మీ కల్నల్ రి అన్ ర్యాంగ్, నేవీ లెఫ్టినెంట్ కమాండర్ యు క్యోంగ్ సాంగ్‌ సహా సీనియర్ సైనిక అధికారులు యూఎస్, సౌత్ కొరియా చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పేర్కొంది.

ఈ రెండు దేశాలు అణు యుద్ధాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వారి ప్రయత్నాలను తప్పి కొట్టాలని కిమ్‌ను కోరినట్టు తెలుస్తోంది. కిమ్ ఆదేశిస్తే ఏ క్షణంలోనైనా తమ శత్రువులపై దాడి చేయడానికి తమ పోరాట సంసిద్ధతను పెంచుకుంటామని వారు స్పష్టం చేసినట్టు వెల్లడించింది. కాగా, యుద్ధాలకు సిద్ధంగా ఉండాలని గతంలో కిమ్ తమ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైనికాధికారుల తాజా ప్రతిజ్ఞ ప్రాధాన్యత సంతరించుకుంది. 1953 జూలై 27 న ఉత్తర కొరియా అమెరికా, చైనాతో యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది మూడేళ్ల కొరియా యుద్ధానికి ముగింపు పలికింది. కాబట్టి ఈ రోజును ఉత్తర కొరియా విక్టరీ డేగా జరుపుకుంటున్నది.

Advertisement

Next Story

Most Viewed