S Jaishankar: 100 బిలియన్ డాలర్లే లక్ష్యం.. భారత్- రష్యా వాణిజ్యంపై జైశంకర్ వ్యాఖ్యలు

by Shamantha N |
S Jaishankar: 100 బిలియన్ డాలర్లే లక్ష్యం.. భారత్- రష్యా వాణిజ్యంపై జైశంకర్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-రష్యా(India-Russia trade) పరిష్కరించుకోవాల్సిన వాణిజ్య సమస్యలు చాలా ఉన్నాయని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్(EAM S Jaishankar) అన్నారు. ముంబైలో నిర్వహించిన ఇండియా-రష్యా బిజినెస్‌ ఫోరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇరుదేశాలు వాణిజ్యపరంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. ప్రతిపాదిత ఇండియా-యురేషియన్ ఎకనామిక్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య 66 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్ల లక్ష్యానికి చేరుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు. అందుకు ఇరుదేశాల మధ్య సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

తక్షణ పరిష్కారం అవసరం

భారత్- రష్యా మధ్య వాణిజ్యమంతా ఏకపక్షంగా ఉందని.. అందుకు తక్షణ పరిష్కారం అవసరమని గుర్తుచేశారు. అందుకు నాన్- టారిఫ్ అడ్డంకులు, నియంత్రణ అడ్డంకులను త్వరగా పరిష్కరించడం అత్యవసరం అని అన్నారు. బ్యాంకింగ్, పేమెంట్, రవాణా సవాళ్లు, బీమా, మార్కెట్ ప్రవేశాలు తదితర సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ డెనిస్‌ మంటురోవ్ కూడా పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed