- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోబెల్ బహుమతి నాకే ఇవ్వాలి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని నడిపినందుకు గాను నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నీటి బిల్లులపై నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఢిల్లీలో ఆస్పత్రులుు, పాఠశాలల నిర్మాణం ఆపడానికి బీజేపీ ప్రయత్నించింది. అంతేగాక ఆప్ ప్రభుత్వంపై అనేక కుట్రలు చేసింది. పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల వన్ టైమ్ సెటిల్‌మెంట్‌లు అమలు చేయకుండా అడ్డుకుంది. కేంద్రాన్ని చూసి భయపడి ప్రభుత్వ అధికారులు ఆప్ ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదు’ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నానో నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నోబెల్ బహుమతి గనుక ఇస్తే అది నాకే ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుందని విమర్శించారు. ఢిల్లీ జల్ బోర్డు పథకాన్ని ఆపివేయాలని లెఫ్ట్ నెంట్‌గవర్నర్ ని కేంద్రం కోరింది. అలాగే అధికారులను సైతం జైలులో పెడతామని బెదిరిస్తోంది అని ఆరోపించారు. కాగా, ఢిల్లీలో వినియోగదారుల పెండింగ్ నీటి బిల్లుల కోసం ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్’ని గతంలో కేజ్రీవాల్ ప్రకటించగా..దీనిని కేంద్రం అడ్డుకుంటుందని ఆప్ ఆరోపిస్తోంది.