బడ్జెట్ సెషన్ లో రెండు రోజులు నో జీరో, క్వశ్చన్ అవర్

by Disha News Desk |
బడ్జెట్ సెషన్ లో రెండు రోజులు నో జీరో, క్వశ్చన్ అవర్
X

న్యూఢిల్లీ: బడ్జెట్ సెషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి రెండు రోజులు జీరో అవర్, క్వచ్చన్ అవర్‌లు ఉండవని కేంద్రం తెలిపింది. ఈ నెల 31న రాష్ట్రపతి ప్రసంగం తో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి రెండు రోజుల సమావేశాల్లో జీరో అవర్, క్వశ్చన్ అవర్ లేవని వెల్లడించింది. కాగా ఏమైనా ప్రజా సమస్యల పై ప్రశ్నలను సభ్యులు ఫిబ్రవరి 2 నుంచి జీరో అవర్‌లో లేవనెత్తాలని ప్రకటన విడుదల చేసింది.

పార్లమెంట్ నిబంధనల ప్రకారం ఉభయసభలో ప్రతిరోజు క్వశ్చన్ అవర్, జీరో అవర్ గంట పాటు నిర్వహించాల్సి ఉంటుంది. కాగా బడ్జెట్ సమావేశాలు మొదటి విడత ఈ నెల 31 నుంచి వచ్చే నెల 11 వరకు జరగనున్నాయి. రెండో విడుతలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు. ఈ సారి కోవిడ్ నిబంధనలతో ఉభయసభలను షిఫ్ట్‌ల వారీగా జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed