గాంధీల కన్నా అవినీతిపరులు ఎవరూ ఉండరు: అసోం సీఎం హిమంత బిస్వ శర్మ

by samatah |
గాంధీల కన్నా అవినీతిపరులు ఎవరూ ఉండరు: అసోం సీఎం హిమంత బిస్వ శర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అసోంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసోం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా.. తాజాగా దీనిపై సీఎం హిమంత బిస్వ శర్మ కౌంటర్ ఇచ్చారు. దేశంలో గాంధీల కంటే అవీనీతి పరులు ఎవరూ లేరని కామెంట్ చేశారు. ‘గాంధీ ఫ్యామిలీ నుంచి విమర్శలు ఎదురైతే దానిని నేను ఒక ఆశీర్వాదంగా భావిస్తా. ఎందుకంటే ఇది నాకు అత్యంత శక్తిమంతమైనదిగా భావించే కుటుంబంతో పోరాడే శక్తిని ఇస్తుంది’ అని పేర్కొన్నారు. ‘నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను, గాంధీల కంటే అవినీతిపరులు ఎవరైనా ఉండగలరా? బోఫోర్స్ స్కామ్, నేషనల్ హెరాల్డ్ స్కామ్, భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, 2జీ స్కామ్, బొగ్గు కుంభకోణం ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి’ అని ప్రశ్నించారు. ఇతరులపై ఆరోపణలు చేసే ముందు తమ పనితీరుపైగా సమీక్షించుకోవాలని హితవు పలికారు. కాగా, దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అసోంలో ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed