నీట్ ప్రక్రియను రద్దు చేసే ప్రసక్తే లేదు: సుప్రీంకోర్టు

by Mahesh |   ( Updated:2024-06-20 06:34:55.0  )
నీట్ ప్రక్రియను రద్దు చేసే ప్రసక్తే లేదు: సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం పరిణామానికి దారి తీసిన నీట్ 2024 యూజీ పరిక్షల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పై ఇప్పటికే పలు సార్లు విచారించిన కోర్టు పేపర్ లీక్ లో 001 శాతం నిర్లక్ష్యం ఉన్న ఎన్టీఏ పై చర్యలు తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది. మరోసారి గురువారం నీట్ పేపర్ లీక్ పై విచారణ జరిపిన కోర్టు.. ఎట్టిపరిస్థితుల్లో నీట్ 2024 ప్రక్రియను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పింది. అలాగే ఈ కేసుకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులలో ఉన్న విచారణలపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న పిటీషన్లను సూప్రీం కోర్టుకు బదిలీ చేయాలని గతంలో ఎన్‌టీఏ కోరిన విషయం తెలిసిందే.

పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలపై NEET-UG 2024 పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన తాజా పిటిషన్‌లను సుప్రీంకోర్టు జూన్ 20న విచారించనుంది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) చుట్టూ ఈ వివాదం కొనసాగుతోంది. 2024 పరీక్ష 1563 మంది అభ్యర్థులు గ్రేస్ మార్కులు పొందారు. 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడం తో నిరసనలు, ఫిర్యాదులు పెరిగాయి. ఈ వైద్య పరీక్షలకు విద్యార్థులు చాలా కష్టపడాల్సిన అవసరం ఉన్నందున పరీక్షకు సంబంధించిన వ్యాజ్యాన్ని వివాదాస్పదంగా పరిగణించరాదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం విదితమే

Advertisement

Next Story

Most Viewed