- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికం: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం అప్రజాస్వామికమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంభిస్తోందని, ప్రతిపక్ష పార్టీల నేతలను భయపెట్టి దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. 'కేజ్రీవాల్‌ను బెదిరించడానికే అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఎందుకు అరెస్టు చేశారో నాకు తెలియదు. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికమని, కేంద్ర ప్రభుతం నియంతృత్వ ధోరణికి ఇది నిదర్శనమని' శుక్రవారం ప్రకటనలో సిద్ధరామయ్య పేర్కొన్నారు. మరోవైపు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించారు. 'బీజేపీ దేశంలోనే అత్యధిక ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడుతోంది. ఆప్‌కు చెందిన మొహల్లా క్లినిక్‌లకు జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను నిలిపేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు ఎవరూ ప్రచారం చేయకూడదని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ అరెస్ట్ అని' ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్, బీజేపీ పదేళ్లుగా నిద్రపోతోంది. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ అరవింద్ కేర్జీవాల్ ప్రచారం చేయకుండా ఆపాలనే ఏకైక లక్ష్యంతో అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.