NITI Aayog: సమావేశానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ డుమ్మా

by Shamantha N |
NITI Aayog: సమావేశానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ డుమ్మా
X

దిశ, నేషనల్ బ్యూరో: నీతి ఆయోగ్ సమావేశానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరుకాలేదు. ఎన్డీఏ కూటమిలో కీలక మిత్రపక్షంగా నితీశ్ కుమార్ జనతా దళ్ (యునైటెడ్) కొనసాగుతోంది. కీలకమైన కార్యక్రమానికి నితీశ్ కుమార్ గైర్హాజరు ఎందుకయ్యారో కారణాలు తెలియాల్సి ఉంది. కాగా.. బిహార్ తరఫున ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా భేటీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి కాదని.. జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ వెల్లడించారు. “సీఎం అంతకుముందు కూడా సమావేశానికి హాజరు కాలేదు. బిహార్ నుంచి అప్పటి డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహించారు. ఈ సారి ఇద్దరు ప్రజాప్రతినిధులు సమావేశానికి వెళ్లారు. అంతేకాకుండా, రాష్ట్రానికి చెందిన నలుగురు సభ్యులు నీతి ఆయోగ్‌లో సభ్యులుగా ఉన్నారు. వారు కూడా హాజరయ్యారు”అని జేడీ(యూ) ప్రతినిధి నీరజ్ కుమార్ తెలిపారు.

హాజరుకాని ఇండియా కూటమి సీఎంలు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వివక్ష చూపారంటూ నిరసిస్తూ పలువురు సీఎంలు భేటీకి హాజరుకాలేదు. ఇండియా కూటమిలో భాగమైన తెలంగాణ, కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు హాజరుకాలేదు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశంలో పాల్గొన్నారు. కానీ ఆతర్వాత కొద్దిసేపటికే భేటీ నుంచి వాకౌట్ అయ్యారు. తనను మాట్లాడనివ్వలేని కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు.



Next Story

Most Viewed