కల్తీ మద్యం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం

by Harish |
కల్తీ మద్యం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం
X

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్య ప్రకటన చేశారు. గతంలో మద్యం సేవిస్తే చస్తారని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా కల్తీ మద్యం సేవించి చనిపోయిన మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు సోమవారం తెలిపారు. కాగా, కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య తాజాగా 26కు చేరింది. ‘మోతిహారి కల్తీ మద్యం సేవించి మరణించిన ఘటనలు నన్ను బాధించాయి. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారే వీరిలో ఎక్కువగా ఉన్నారు. మద్యం నియంత్రణకు ఎంత ప్రయత్నించిన రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాలు నమోదవుతూనే ఉన్నాయి’ అని నితీష్ అన్నారు.

అయితే కలెక్టర్ ద్వారా ధ్రువీకరణ పత్రం ఉంటేనే పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధ చట్టాలకు కుటుంబ సభ్యులందరూ ప్రొత్సహిస్తామని ప్రకటించాలని అన్నారు. 2016లోనే బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చింది. కాగా, తాజా ఘటనలో కల్తీ మద్యం విక్రయిస్తున్న 80 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed