Adani స్టాక్ క్రాష్‌పై Nirmala Sitharaman ఫస్ట్ రియాక్షన్

by GSrikanth |   ( Updated:2023-02-04 09:01:02.0  )
Adani స్టాక్ క్రాష్‌పై Nirmala Sitharaman ఫస్ట్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అదానీ షేర్ల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటిసారి స్పందించారు. శుక్రవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ, ఎస్‌బీఐకి చెందిన భారీ పెట్టుబడులు ఉన్నాయని ఇదంతా ప్రజాధనం అని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఆమె స్పందిస్తూ అదానీ కంపెనీల్లో అనుమతించిన పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, పరోక్షంగా అదానీ షేర్ల పతనం బ్యాంకింగ్ రంగంపై ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు.

విదేశీ పదుపర్లు గతంలో మాదిరిగానే నిశ్చింతగా భారత్‌లో పెట్టుబడులు కొనసాగించవచ్చని తెలిపారు. దేశీయ మార్కెట్లను పటిష్టంగా ఉంచడంలో నియంత్రణ సంస్థలు నిక్కచ్చిగా పని చేస్తున్నాయన్నారు. అదానీ గ్రూప్‌లలో తమ పెట్టుబడులు చాలా తక్కువే ఉన్నాయని ఎల్ఐసీ, ఎస్ బీఐ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. కాగా అదానీ అంశంపై ఆర్థిక కార్యదర్శి టి.వి సోమనాథన్ మాట్లాడుతూ స్థూల ఆర్థిక వ్యవస్థ కోణంలో చూస్తే అదానీ షేర్ల పతనం వల్ల స్టాక్ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి వాతావరణం అనేది టీ కప్పులో తుఫాన్ లాంటిదని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి : Adani Group పై వచ్చిన ఆరోపణలపై మొదటిసారి స్పందించిన Nirmala Sitharamana

Advertisement

Next Story

Most Viewed