Union Budget 2024: అప్ డేట్స్ ఇవే..!

by Shamantha N |
Union Budget 2024: అప్ డేట్స్ ఇవే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి(Union Finance minister) నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా.. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సమర్పిస్తున్న బడ్జెట్ ఇది. కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ డాక్యుమెంట్‌తో రాష్ట్రపతి భవన్‌కు(Rashtrapati Bhawan) వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి తీసుకోనున్నారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లేమందు ఆమె టీంతో బహీ ఖాతా(bahi-khata)తో కన్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో దహీ షక్కర్ వేడుక జరగనుంది. అక్కడ్నుంచి పార్లమెంటులో జరిగే కేబినేట్ మీటింగ్ కు ఆమె బయల్దేరనున్నారు. ఆ తర్వాత 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.

బడ్జెట్ పై ఆశలు

అయితే మోదీ 3.0లో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌పై వివిధ వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పన్ను విధనంలో ఉపశమనం కోసం సామాన్యులు ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని, వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే, దేశీయ స్టార్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో దూసుకెళ్తున్నాయి.



Next Story