జమ్మూ కశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు..ఉగ్ర కార్యకలాపాల కేసులో చర్యలు

by samatah |
జమ్మూ కశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు..ఉగ్ర కార్యకలాపాల కేసులో చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం దాడులు చేపట్టింది. సుమారు 9 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. ఎన్ఐఏ దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. 2022లో నమోదైన ఓ ఉగ్రవాద కేసు విచారణలో భాగంగా ఈ దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది. శ్రీనగర్‌లో నివసిస్తున్న కొందరు అనుమానితులపై ఎన్ఐఏకు సమాచారం అందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. నిందితులు లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)తో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంస్థ కశ్మీర్‌లోని యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంలో పాలు పంచుకుంటున్నాయని ఆరోపణలున్నాయి. వారిని ఆకర్షించడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే 2022 జూన్‌లో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ సుమోటోగా స్వీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఎన్ఐఏ కశ్మీర్‌లో దాడులు నిర్వహించింది.

Advertisement

Next Story

Most Viewed