- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ఐఏ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగాల్ పోలీసులు
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని భూపతినగర్‌లో 2022 నాటి పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బృందంపై దాడి చేసిన ఘటనకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే టీఎంసీ నేత మోనోబత్రా జానా భార్య ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐసీ బృందంపై రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎన్ఐఏ అధికారులు తమ ఇంట్లోకి జొరబడి కొట్టారని, అధికారులు తన గౌరవానికి భంగం కలిగించారని టీఎంసీ నేత భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ బృందంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే వ్యవహారంలో ఎన్‌ఐఏ సైతం భూపతినగర్ పోలీస్ స్టేషన్‌లో దాడి గురించి గ్రామస్తులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. వివరాల ప్రకారం.. 2022లో జరిగిన బాంబు పేలుడు ఘటన గురించి దర్యాప్తు కోసం ఎన్ఐఏ బృందం ఆ ప్రాంతానికి వెళ్లడంతో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోల్‌కతాకు బయలుదేరారు. ఆ సమయంలోనే ఎన్ఐఏ బృందంపై దాడి జరిగింది. గ్రామస్తులు ఎన్ఐఏ బృందం కాన్వాయ్‌ను చుట్టుముట్టి రాళ్లను రువ్వారు. ఈ ఘటనలో పలువురు అధికారులు గాయపడ్డారు. మరోవైపు టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. మమతా హయాంలో బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా నాశనమయ్యాయని, పోలీసుల అండతోనే ఇదంతా జరుగుతున్నట్టు ఆరోపణలు చేసింది.