- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సందేశ్‌ఖాలీలో అనేక మానవ హక్కుల ఉల్లంఘనలు: NHRC
దిశ, నేషపల్ బ్యూరో: ఇటీవల సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన దాడులు, భూకబ్జాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో జరిగిన అన్యాయాల గురించిన వివరాలను జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) ఏప్రిల్ 13, శనివారం నాడు విడుదల చేసింది. స్పాట్ విచారణ నివేదికలో సందేశ్‌ఖాలీ గ్రామంలో అనేక మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయని NHRC స్పష్టం చేసింది. కమిషన్ స్పాట్ విచారణ బాధితులపై జరిగిన అనేక దౌర్జన్యాలను బహిర్గతం చేసింది.
ఆ ప్రాంతంలోని బాధితులు, గ్రామస్తులు దాడి, బెదిరింపు, లైంగిక దోపిడీ, భూకబ్జాలు వంటి వాటిని ఎదుర్కొన్నారు. వారికి కనీసం వేతనాలు కూడా చెల్లించలేదు. దీంతో, వారు సందేశ్‌ఖాలీ ప్రాంతం బయట తమ జీవనోపాధిని వెతకవలసి వచ్చింది. వృద్ధాప్య పింఛను, MGNREGA, ప్రజా పంపిణీ వ్యవస్థ, గృహాలు, మరుగుదొడ్లు నిర్మించడానికి ఆర్థిక సహాయం వంటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఈ ప్రాంతంలోని స్థానికులకు అందించకుండా వివక్షకు గురి చేశారు. అక్కడి స్థానికుల ప్రజాస్వామ్య ఓటు హక్కును కూడా హరించివేశారు. ఎవరూ కూడా ఎదురు తిరిగి మాట్లాడకుండా పలుకుబడితో, భయంతో స్థానికుల వాక్ స్వాతంత్య్ర ప్రజాస్వామ్య హక్కును కూడా హరించివేశారని NHRC నివేదిక పేర్కొంది.
ప్రభుత్వ సేవకుడు ఇటువంటి ఉల్లంఘనలను నివారించడంలో నిర్లక్ష్యం వహించారని, ప్రాథమికంగా, అక్కడి ప్రజలకు దక్కాల్సిన హక్కులను అందించకుండా వారి గొంతు నొక్కారు. మహిళలపై లైంగిక దోపిడీ, భూకబ్జాలు వంటి సంఘటనలు జరిగాయని స్పష్టంగా కనిపిస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. ఎనిమిది వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) సమర్పించాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీకి NHRC తన నివేదికను పంపింది.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు షాజహాన్ షేక్‌తో సంబంధం ఉన్న స్థానిక ముఠా పేద మహిళలను వేధింపులకు గురి చేసి లైంగిక వేధింపులకు గురిచేశారని సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని స్థానికులు ఆరోపించడంతో దేశవ్యాప్తంగా ఇది సంచలనం అయింది. సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై జరిగిన దాడులకు సంబంధించిన మూడు కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారిస్తోంది. ఈ కేసుల్లో షాజహాన్ షేక్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.