బెంగళూరులో విపక్షాల మీటింగ్ వాయిదా..

by Vinod kumar |
బెంగళూరులో విపక్షాల మీటింగ్ వాయిదా..
X

బెంగళూరు : జూలై 13,14 తేదీల్లో బెంగళూరులో జరగాల్సిన విపక్ష పార్టీల సమావేశం వాయిదా పడింది. దీన్ని జూలై 17,18 తేదీలలో నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. “పాట్నాలో జూన్ 23న జరిగిన అఖిలపక్ష సమావేశం విజయవంతమైంది. దీంతో తదుపరి సమావేశాన్ని జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో నిర్వహిస్తున్నాం. ఫాసిస్ట్, అప్రజాస్వామిక శక్తులను ఓడించండి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ధైర్యమైన దృక్పథాన్ని ప్రదర్శించండి" అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. వాస్తవానికి ఈ మీటింగ్‌ను హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో నిర్వహించాలని తొలుత భావించారు.

అయితే ఈ వేదికను సిమ్లా నుంచి బెంగళూరుకు మార్చినట్లు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ జూన్ 29న వెల్లడించారు. ఎన్‌సీపీ చెందిన అజిత్ పవార్ తిరుగుబాటు చేసి షిండే-బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన ఒక రోజు తర్వాత విపక్షాల మీటింగ్ తేదీని కాంగ్రెస్ ప్రకటించడం గమనార్హం. ప్రాంతీయ పార్టీలకు బీజేపీ నుంచి పొంచి ఉన్న ముప్పు, యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి అంశాలపై ఫోకస్‌తో జూలై 17, 18 తేదీల్లో జరిగే ప్రతిపక్ష పార్టీల భేటీలో చర్చించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed