హిందువులు, ముస్లింలు కలిసిమెలసి జీవించడమే సంప్రదాయం- అమర్త్యసేన్

by Shamantha N |   ( Updated:2024-07-14 07:09:35.0  )
హిందువులు, ముస్లింలు కలిసిమెలసి జీవించడమే సంప్రదాయం- అమర్త్యసేన్
X

దిశ, నేషనల్ బ్యూరో: హిందువులు, ముస్లింలు కలిసి మెలిసి జీవించే సంప్రదాయం భారతదేశానికి ఉందని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. అలీపూర్‌ జైలు మ్యూజియంలో జరిగిన పుస్తక పఠనానికి సంబంధించి శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘మన దేశ చరిత్రను పరిశీలిస్తే.. హిందువులు, ముస్లింలు యుగయుగాలుగా సంపూర్ణ సమన్వయం, సామరస్యంతో కలిసి పనిచేస్తున్నారు. దీనిని ‘జుక్తోసాధన’ అంటారని క్షితిమోహన్ సేన్ తన పుస్తకంలో చెప్పారు. ప్రజల మధ్య విభేదాలు తలెత్తుతున్న ప్రస్తుత సమాజంలో జుక్తోసోధనను నొక్కి చేప్పాలి. దేశం కోసం ప్రజలంతా కలిసి పని చేయాలి’’అని పేర్కొన్నారు.

జుక్తోసాధన

కళలు, సామాజిక సేవ, రాజకీయాల్లో ‘జుక్తోసాధన’ కనిపిస్తుందన్నారు. ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్‌ల శాస్త్రీయ సంగీత శైలి ప్రకారం వారిలోని వ్యత్యాసాన్ని చూడగలం కానీ..మతపరంగా చూడలేము కదా? అని ఆయన ప్రశ్నించారు. పిల్లల్లో ఎలాంటి భేద భావాలు ఉండవు కాబట్టి వారిలో ఈ సమస్యలు తలెత్తవన్నారు. పిల్లల్లో మతపరమై విషబీజాలు నాటవద్దన్నారు. అందుకోసం పిల్లల్లో సహనం, విలువలు పెంపొందాల్చిన అవసరం ఉందన్నారు. మతపరమైన అణచివేతలకు పాల్పడుతున్న వారికి ముంతాజ్ కుమారుడు దారాషికో గురించి గుర్తుంచుకోవాలన్నారు. ఉపనిషత్తులను పార్సీలోకి అనువదించారన్న విషయాన్ని మరిచిపోతున్నారని చురకలు అంటించారు. తాజ్‌మహల్‌ విషయంలో కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నారని అమర్త్యసేన్ పేర్కొన్నారు. కొందరు దీన్ని ముంతాజ్‌ జ్ఞాపకార్థం నిర్మించిన అద్భుతమైన కట్టడాన్ని చూస్తారని అన్నారు. మరికొందరు మాత్రం ముస్లిం పాలకుల పేరుతో ఉన్న ఈ స్మారక చిహ్నాల పేర్లను మార్చాలని భావిస్తున్నారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed